AP Sand: ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు..! 24 d ago
ఇసుక సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందుల నేపథ్యంలో కీలకమైన ఆదేశాలు జారీ చేసారు. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాల్సిందిగా ఆదేశించారు. గురువారం నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని అన్నారు.